hebba patel: రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్న '24 కిస్సెస్'

  • తెరపైకి మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ 
  • ఈ నెల 23వ తేదీన విడుదల 
  • ఈ సినిమాపైనే హెబ్బా ఆశలు    
అయోధ్య కుమార్ దర్శకత్వంలో ఆదిత్ అరుణ్ .. హెబ్బా పటేల్ జంటగా '24 కిస్సెస్' సినిమా నిర్మితమైంది. టైటిల్ ను బట్టే ఇది యూత్ కి సంబంధించిన కథ అనీ, ప్రేమకథా చిత్రమనే విషయం అర్థమైపోతోంది. రీసెంట్ గా వదిలిన ట్రైలర్ కి 2 మిలియన్ వ్యూస్ దాటిపోవడంతో, ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను ఈ నెల 23వ తేదీన విడుదల చేయనున్నారు. ఇటీవల వచ్చిన కొన్ని ప్రేమకథా చిత్రాలు కంటెంట్ తోనే కాసుల వర్షం కురిపించాయి. అదే బాటలో ఈ సినిమా కూడా పరుగులుతీసే అవకాశం ఉందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఈ మధ్య కాలంలో హెబ్బా పటేల్ కి అంతగా అవకాశాలు లేవు. అందువలన ఈ సినిమాతో హిట్ పడితే బాగుంటుందనే ఆశతో ఆమె వుంది. ఈ సినిమా యూత్ కి ఎంతవరకూ కనెక్ట్ అవుతుందో .. ఏ స్థాయి వసూళ్లను రాబడుతుందో చూడాలి.  
hebba patel
adith

More Telugu News