sobhan babu: శోభన్ బాబు ముందుగా అదేమాట అడిగారు: పరుచూరి గోపాలకృష్ణ

  • శోభన్ బాబుతో 40 రోజుల షూటింగ్ 
  • సాయంత్రం 5 కాగానే వాచ్ చూసుకునేవారు 
  • 'మల్లెపువ్వు'లా ఆయనను చూసుకున్నాను
తాజాగా ఒక వేదికపై శోభన్ బాబు గురించి పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు. "శోభన్ బాబు గారితో నేను 'సర్పయాగం' సినిమా చేశాను. 40 రోజుల పాటు ఏకధాటిగా జరిగిన షూటింగు వలన మా మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఈ సినిమా కథ ఆయనకి చెప్పడానికి వెళ్లినప్పుడు, 'నన్ను ఎలా చూసుకుంటారు?' అని అడిగారు. 'మల్లెపువ్వు'లా చూసుకుంటామని చెప్పాను.

ఇక సాయంత్రం 5 గంటలు కాగానే ఆయన చేతికున్న వాచ్ చూసుకునేవారు. 'మల్లెపువ్వు' వాడిపోతోంది .. పదండి' అంటూ నవ్వుతూ ముందుగా ఆయనను పంపించేసేవాడిని. ఒకసారి ఆయనతో రాత్రివేళ షూటింగు చేయవలసి వచ్చింది. అప్పుడు ఆయనతో 'సార్ .. నైట్ షూటింగ్ మరీ .. 'మల్లెపువ్వు' పగలు నిద్రపోయి .. రాత్రి పనిచేయాలి' అన్నాను. అందుకు ఆయన నవ్వుతూనే సహకరించారు .. రాత్రివేళ షూటింగ్ అయినా ఆయన తొందరపెట్టేవారు కాదు. అలా శోభన్ బాబుగారితో కలిసి పనిచేయడాన్ని నేను ఒక అదృష్టంగా భావిస్తూ వుంటాను" అని చెప్పుకొచ్చారు.  
sobhan babu
paruchuri

More Telugu News