Manchu Manoj: రాజకీయ ప్రవేశంపై మంచు మనోజ్ ఇంకాస్త క్లారిటీ!

  • గత నెలలో ఫ్యాన్స్ కు లేఖ
  • నీ గోల్ ఏంటని ప్రశ్నించిన అభిమాని
  • ఖాళీ ప్రదేశాన్ని చూపుతూ ట్వీట్
తనకు రాజకీయాల్లోకి రావాలని వుందని, తిరుపతి కేంద్రంగా ప్రజా సేవను ప్రారంభించి, రాయలసీమ ప్రాంతమంతటికీ విస్తరిస్తానని గత నెలలో అభిమానులకు లేఖ రాసిన మంచు మనోజ్, తన రాజకీయ అరంగేట్రంపై ఇంకాస్త స్పష్టత ఇచ్చాడు.

ఓ అభిమాని ట్విట్టర్ వేదిక ద్వారా మనోజ్ ను ప్రశ్నిస్తూ, "అసలు నీ ప్లాన్ ఏంటి, నీ స్కీం ఏంటి, నీ గోల్ ఏంటి?" అని అడుగగా స్పందించాడు. ఓ ఖాళీగా ఉన్న ప్రదేశంలో దిగిన ఫొటోను జత చేసిన మనోజ్, "పేద విద్యార్ధులు, రైతుల కోసం ఏదో చేయాల‌నుకున్న నా క‌ల ఈ ఖాళీ ప్ర‌దేశం ద్వారా తీర‌బోతుంది" అన్నాడు. తన కల ఇక్కడి నుంచే తీరబోతోందని, తానున్న చోట, ఉచిత ఆహారం, క్రీడా సౌకర్యాలు, మంచినీటి వసతి ఉండాలన్నదే తన లక్ష్యమని చెప్పాడు.
Manchu Manoj
Politics
Empty Land
Tirupati
Twitter

More Telugu News