జోరుమీదున్న యోగి ప్రభుత్వం... రాముడి విగ్రహం కోసం శిల్పి వేటలో అధికారులు
- ఆర్కిటక్ట్, డిజైన్ కన్సల్టెంట్ కోసం టెండర్లు
- సీఎంను కలిసి ప్రజంటేషన్ ఇచ్చిన ప్రతినిధులు
- త్వరలోనే నిర్మాణ సంస్థ ఎంపిక
షార్ట్ లిస్ట్ అయిన సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిసి ప్రజంటేషన్ ఇచ్చినట్టు అధికారులు తెలిపారు. ప్రజంటేషన్లో మార్పులు చేర్పుల అనంతరం తుది ఎంపిక చేయనున్నట్టు పేర్కొన్నారు. ఆర్కిటెక్ట్‌ను ఎంపిక చేసిన అనంతరం విగ్రహ నిర్మాణ సంస్థను ఎంపిక చేస్తామన్నారు. రాముడి విగ్రహం మొత్తం నిర్మాణం ఎత్తు 201 మీట్లు కాగా, అందులో పీఠం ఎత్తు 50 మీటర్లు, విగ్రహం ఎత్తు 151 మీటర్లు.