Bura Narasiah Goud: ఎంగిలి మెతుకుల కోసమే.. తెలంగాణను తాకట్టు పెట్టేందుకు సిద్ధమయ్యారు: ఎంపీ నర్సయ్య గౌడ్

  • రూ.2వేల కోట్లతో యాదాద్రి అభివృద్ధి
  • ఒక్క ఎకరాకు కూడా నీళ్లివ్వలేదు
  • త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు
త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు రాబోతున్నాయని భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ ఒక్క ఎకరాకు కూడా నీళ్లివ్వలేదని ఆరోపించారు. నేడు నర్సయ్య గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ విదిల్చే ఎంగిలి మెతుకుల కోసమే కూటమి దొంగలు.. తెలంగాణను ఆంధ్రాకు తాకట్టు పెట్టేందుకు సైతం సిద్ధమయ్యారని విమర్శించారు.

కేసీఆర్ రూ.2వేల కోట్లతో యాదాద్రిని అభివృద్ధి చేస్తున్నారని నర్సయ్య గౌడ్ తెలిపారు. తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు చూస్తుంటే.. కేసీఆర్ మాత్రం ఎలాగైనా ఆ ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణను అభివృద్ధి పరచాలని చూస్తున్నారని ఆయన తెలిపారు.  
Bura Narasiah Goud
Godavari
Kaleswaram
KCR
Telangana

More Telugu News