kcr: మేము అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ ని ప్రజా ఆసుపత్రిగా మారుస్తాం: టీ-టీడీపీ నేత ఎల్.రమణ

  • కేసీఆర్ వెయ్యి కోట్లతో ప్రగతి భవన్ నిర్మించారు
  • పేదలకు మాత్రం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదు
  • ‘తెలంగాణ’ నలుగురి చేతిలో బందీ అయిపోయింది
తెలంగాణలో తాము అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ ని ప్రజా ఆసుపత్రిగా మారుస్తామని టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వని సీఎం కేసీఆర్ వెయ్యి కోట్లతో ప్రగతిభవన్ నిర్మించుకున్నారని ఆరోపించారు.

బీసీలు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిపోతున్నారని, బడుగు వర్గాల ప్రజలను పాలకులు పట్టించుకోకపోవడంతో వారు నిరాదరణకు గురవుతున్నారని విమర్శించారు. త్యాగాల పునాదులపై నిర్మించబడ్డ తెలంగాణ రాష్ట్రం నలుగురి చేతిలో బందీ అయిపోయిందంటూ కేసీఆర్ కుటుంబంపై ఆయన విమర్శలు చేశారు. బందీ అయిన తెలంగాణకు విముక్తి కలిగించేందుకు ఏ త్యాగానికైనా తాము సిద్ధమేనని రమణ స్పష్టం చేశారు.
kcr
L.ramana
TRS
Telugudesam

More Telugu News