Harish Rao: అభివృద్ధిలో గజ్వేల్ దూసుకుపోతోంది: మంత్రి హరీశ్ రావు

  • కాంగ్రెస్, టీడీపీ పాలనలో ఇక్కడ అభివృద్ధి జరగలేదు
  • నాలుగేళ్లలో అన్నిరంగాల్లో గజ్వేల్ ను అభివృద్ధి చేశాం
  • ‘కాంగ్రెస్’కు ఓటేస్తే అభివృద్ధి ఆగిపోవడం ఖాయం
సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ లో ముస్లింల మైనార్టీల గర్జన సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న హరీశ్ రావు మాట్లాడుతూ, అభివృద్ధిలో గజ్వేల్ దూసుకుపోతోందని, కాంగ్రెస్, టీడీపీ పాలనలో ఇక్కడ అభివృద్ధి జరగలేదని, నాలుగేళ్లలో అన్ని రంగాల్లో గజ్వేల్ ను అభివృద్ధి చేశారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో ముస్లింల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, షాదీముబారక్ ద్వారా రూ.లక్షా 116 అందిస్తున్నామని, ఇళ్లు లేని పేద ముస్లింలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి ఇస్తున్నామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే గజ్వేల్ అభివృద్ధి ఆగిపోవడం ఖాయమని, లక్ష మెజార్టీతో సీఎం కేసీఆర్ ను గెలిపించుకోవాలని కోరారు.

ముస్లింలంతా సీఎం కేసీఆర్ వెంటే 

ముస్లిం విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్ షిప్ ఇస్తున్నారని, వారి కోసం ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశారని, ముస్లింలంతా సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. ముస్లింలకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఘనత కేసీఆర్ దేనని కొనియాడారు.
Harish Rao
gujwel
TRS
Telugudesam
Congress

More Telugu News