Chandrababu: అందుకే, రాహుల్ తో చంద్రబాబు పూసుకు తిరుగుతోంది: ఎంపీ విజయసాయిరెడ్డి

  • ఐటీ సోదాల నుంచి రక్షణ పొందాలని చూస్తున్న బాబు
  • చిదంబరం, వాద్రాలే కేసుల్లో ఇరుక్కుపోయి ఉన్నారు!
  • ఇంకా, చంద్రబాబును రాహులేమి కాపాడతారు?
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోమారు విమర్శలు చేశారు. ఐటీ సోదాల నుంచి రక్షణ పొందేందుకే రాహుల్ తో చంద్రబాబు పూసుకు తిరుగుతున్నారని, జాతీయ స్థాయి లీడర్ నని ఐటి శాఖను బెదిరించాలని చూస్తున్నారని చంద్రబాబును విమర్శించారు.

చిదంబరం, రాబర్ట్ వాద్రాలే అక్రమ సంపాదన కేసుల్లో ఇరుక్కుపోయి ఉన్నారని, ఇంకా, చంద్రబాబును.. రాహులేం కాపాడతాడు? అని ప్రశ్నిస్తూ ఓ ట్వీట్ చేశారు. ‘స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌(సిట్‌)లు, కమిషన్‌లు చంద్రబాబు చెప్పినట్లుగా నివేదికలు ఇచ్చే వ్యవస్థలన్నది బహిరంగ రహస్యమని,  బాబు ‘సిట్‌’ అంటే కూర్చుని, ‘స్టాండ్‌’అంటే నిలబడి తమ వీరవిధేయతను అవి ప్రకటిస్తాయి’ అని తన ట్వీట్ లో విజయసాయి ఆరోపించారు.  
Chandrababu
rahul gandhi
mp vijayasaireddy

More Telugu News