Chandrababu: సీఎం చంద్రబాబు ఢిల్లీ స్థాయిలో పోరాడట్లేదు: సీపీఐ రామకృష్ణ విమర్శ

  • చంద్రబాబు 29 సార్లు ఢిల్లీ వెళ్లారు
  • అఖిలపక్షాలను ఎందుకు తీసుకెళ్లలేదు?
  • కేంద్రంపై అంతిమ పోరాటానికి మళ్లీ సిద్ధమవుతున్నాం
సీఎం చంద్రబాబు ఢిల్లీ స్థాయిలో పోరాడట్లేదని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. గుంటూరులో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 29 సార్లు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. అఖిలపక్షాలను ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు.

విభజన హామీలను కేంద్రం విస్మరించిందని, పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పిన బీజేపీ మాట తప్పిందని మండిపడ్డారు. కేంద్రంపై అంతిమ పోరాటానికి మళ్లీ సిద్ధమవుతున్నామని, ఈ నెల 12న శ్రీకాకుళం నుంచి హిందూపురం వరకు నిరసన సభలు నిర్వహిస్తామని చెప్పారు. 
Chandrababu
cpi ramakrishna
bjp

More Telugu News