Sharook Khan: షారుక్ ఖాన్ ని కలవాలని వచ్చిన అభిమాని ఆత్మహత్యాయత్నం!

షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుక్‌ ఖాన్‌ అభిమాని ఒకరు ఆయన్ను కలవాలన్న కోరికతో, ఆయన నివాసం ముందే ఆత్మహత్యాయత్నం చేశాడు. నిన్న రాత్రి షారూక్‌ దీపావళి పార్టీని ఏర్పాటు చేసిన వేళ ఈ ఘటన జరిగింది. విందుకు పలువురు సినీ ప్రముఖులను ఆహ్వానించారు షారూక్. ఇదే సమయంలో కోల్‌ కతాకు చెందిన మహమ్మద్‌ సలీమ్ అనే అభిమాని షారూక్ ఇంటికి వచ్చి, అతన్ని కలవాలని కోరాడు. సెక్యూరిటీ సిబ్బంది అతన్ని ఇంటి లోపలి వెళ్లనీయలేదు.

ఈ నేపథ్యంలో వెంట తెచ్చుకున్న కత్తితో ఆ అభిమాని తన చెయ్యిని కోసుకున్నాడు. దీన్ని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నం చేసుకుంటే, ఈ రకంగానైనా షారుక్‌ను కలిసే అవకాశం వస్తుందని భావించి ఇలా చేసినట్టు సలీం పోలీసులకు తెలిపాడు.
Go Back to Shorts
Sharook Khan
Sucide Attempt
Fan
Mumbai
Deewali

More Telugu News