palniswamy: తమిళనాడు ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్టాలిన్‌పై కేసు

  • ప్రభుత్వ అనుమతితో కోర్టులో పిటిషన్‌ దాఖలు
  • సెప్టెంబరు 18న సేలం కలెక్టరేట్‌ ఎదుట డీఎంకే ధర్నా
  • ఈ సందర్భంగా ఘాటైన వ్యాఖ్యలు చేసిన డీఎంకే అధ్యక్షుడు
డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌పై తమిళనాడు ప్రభుత్వం కేసు నమోదు చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి, పళనిస్వామి, అతని ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదు చేశారు. సెప్టెంబరు 18వ తేదీన సేలం కలెక్టరేట్‌ ఎదుట డీఎంకే ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

ఆ సందర్భంలో స్టాలిన్‌ ముఖ్యమంత్రి, ప్రభుత్వం తీరుపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారంటూ ప్రభుత్వ న్యాయవాది ధనశేఖరన్‌ కోర్టులో కేసు వేశారు. ఎటువంటి సాక్ష్యాలు లేకుండా సీఎం, మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారంటూ స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు అన్నాడీఎంకే ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని ధనశేఖరన్‌ అన్నారు. త్వరలోనే ఈ పిటిషన్‌ విచారణకు రానుందని తెలిపారు.
palniswamy
case againist stalin
DMK

More Telugu News