Rahul Gandhi: ఆయన అబద్ధాలను ఏకే-47లా పేలుస్తున్నారు: మోదీ

  • రాహుల్ పేరెత్తకుండా విమర్శలు
  • వారసుల కోసమే ప్రతిపక్షాలు ఏకమయ్యాయన్న మోదీ
  • దేశం తలరాతను మార్చేందుకు బీజేపీ కృషి చేస్తోందన్న ప్రధాని
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ మరోమారు ఫైరయ్యారు. రాహుల్ పేరును ప్రస్తావించకుండా ఆయనో ‘అబద్ధాల యంత్రం’ అని అభివర్ణించారు. ‘‘కొందరు నేతలు అబద్ధాల మిషన్లలా తయారయ్యారు. వారు తమ నోటిని తెరిచిన ప్రతిసారి అబద్ధాలు ఏకే 47లా పేలుతుంటాయి’’ అని రాహుల్‌ను ఉద్దేశించి విమర్శించారు. బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసిన మోదీ.. నేతలు చెప్పే అబద్ధాలను గుర్తించి ప్రజల్లోకి వెళ్లి వాటికి సరైన సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు.

ప్రతిపక్షాలు తాము పాలిస్తున్న రాష్ట్రాలు చేజారిపోకుండా చేతులు కలిపాయన్న మోదీ.. దేశం తలరాతను మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. కొందరు నేతలు ఒక్క రోజులోనే బోలెడన్ని మాటలు మారుస్తుంటారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీలు తమ వారసుల కోసమే చేతులు కలిపాయని మోదీ విమర్శించారు.
Rahul Gandhi
Narendra Modi
Congress
BjP
AK47

More Telugu News