chintakayala ayyanna patrudu: ఆ స్వభావం తెలుగుదేశం పార్టీలోనే ఉంది: మంత్రి అయ్యన్నపాత్రుడు

  • తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి పరిస్థితులే ఇప్పుడు కూడా
  • అందుకే కాంగ్రెస్‌తో చేతులు
  • తెలుగు ప్రజలను కించపరిస్తే పోరాటమే
తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఏపీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు. అలా చేసే వారిపై పోరాటం చేయడమే టీడీపీ స్వభావమని పేర్కొన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాండేందుకే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని పేర్కొన్న మంత్రి.. దానిని కించపరిస్తే మాత్రం పోరాటం తప్పదన్నారు.

ఆ స్వభావం తెలుగుదేశం పార్టీలోనే ఉందన్నారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పటి పరిస్థితులే ప్రస్తుతం ఉన్నాయని, అందుకనే కాంగ్రెస్‌తో చేతులు కలపాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఇందిరాగాంధీ హయాంలోనూ ఆదాయపు పన్ను శాఖను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోలేదని, కానీ ఇప్పుడు మోదీ తన రాజకీయ స్వప్రయోజనాల కోసం ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు.
chintakayala ayyanna patrudu
Telugudesam
Congress
NTR
Andhra Pradesh

More Telugu News