America: అమెరికాలో మళ్లీ కాల్పులు.. యోగా స్టూడియోలో రెచ్చిపోయిన ఆగంతుకుడు

  • యోగా స్టూడియోలో దుండగుడి కాల్పులు
  • ఇద్దరు మృతి, ఐదుగురికి గాయాలు
  • తనను తాను కాల్చుకున్న నిందితుడు
అమెరికాలోని ఓ యోగా స్టూడియోలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన అనంతరం నిందితుడు తనను తాను కాల్చుకున్నాడు. ఫ్లోరిడాలోని టల్లహసీలో ఈ ఘటన చోటుచేసుకుంది.  యోగా స్టూడియోలోకి ఒంటరిగా ప్రవేశించిన స్కట్ పాల్ బీర్లె (40) వచ్చీ రావడంతోనే తుపాకితో విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. దీంతో నాన్సీ వాన్ వెస్సెమ్ (61) అనే వైద్యురాలితోపాటు మౌరా బ్లింకీ (21) అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా హాహాకారాలు మిన్నంటాయి. ఏం జరుగుతోందో తెలియక ప్రాణభయంతో పరుగులు తీశారు. ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి దుండగుడి చేతిలోని తుపాకిని లాక్కునేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన మరికొందరు అతడికి సహకరించారు. లేదంటే మరింత ప్రాణనష్టం జరిగి ఉండేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
America
Gun shooting
pitsburg
Florida
Yoga studio

More Telugu News