kalyanram: బాలయ్య ప్లాన్.. జూబ్లీహిల్స్ నుంచి ఎన్నికల బరిలోకి కల్యాణ్ రామ్?

  • కల్యాణ్ రామ్ ను ఎన్నికల బరిలో దింపేందుకు యత్నిస్తున్న బాలయ్య
  • రంగంలోకి దిగితే గెలుపు ఖాయమని భావిస్తున్న బాలకృష్ణ
  • కల్యాణ్, తారక్ లకు తండ్రిలేని లోటును తీర్చుతున్న బాలయ్య
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలసి టీడీపీ మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో, రాష్ట్రంలో ఎలక్షన్ హీట్ పెరిగింది. మరోవైపు, జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి తన అన్న హరికృష్ణ కుమారుడు కల్యాణ్ రామ్ ను బరిలోకి దింపాలని బాలకృష్ణ ప్లాన్ చేస్తున్నాట్టు విశ్వసనీయ సమాచారం.

ఈ స్థానం నుంచి కల్యాణ్ రామ్ పోటీ చేస్తే, గెలుపు నల్లేరు మీద నడకే అని బాలయ్య భావిస్తున్నారు. హరికృష్ణపై ప్రజల్లో ఉన్న సానుభూతి కూడా కలిసొస్తుందనేది ఆయన నమ్మకం. మరోవైపు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కల్యాణ్ రామ్ సిద్ధంగాలేడని కొందరు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకోబోయే నిర్ణయం కీలకం కాబోతోందని అంటున్నారు. హరికృష్ణ మరణం తర్వాత... కల్యాణ్ రామ్, తారక్ లకు తండ్రిలేని లోటును బాలయ్యే తీర్చుతున్నారు. ఎన్టీఆర్ చిత్రం 'అరవిందసమేత' సక్సెస్ మీట్ కు కూడా ఆయన హాజరయ్యారు. 
kalyanram
Balakrishna
junior ntr
Chandrababu
elections
Telangana
jubilee hills

More Telugu News