Harish Rao: రాహుల్ తో హరీష్ రావు టచ్ లో ఉన్నారు.. త్వరలోనే కాంగ్రెస్ లో చేరుతారు: వంటేరు ప్రతాప్ రెడ్డి

  • కేటీఆర్, హరీష్ ల మధ్య విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి
  • టీఆర్ఎస్ కు హరీష్ గుడ్ బై చెప్పనున్నారు
  • కేసీఆర్ కనిపించకుండా పోయారు
టీఆర్ఎస్ పార్టీలో ఇంటిపోరు ఎక్కువైందని కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. కేటీఆర్, హరీష్ రావుల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయని... ఈ నేపథ్యంలో హరీష్ టీఆర్ఎస్ ను వీడనున్నారని చెప్పారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో హరీష్ టచ్ లో ఉన్నారని...త్వరలోనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారని అన్నారు. కొంగరకలాన్ సభ తర్వాత 108 సభలు పెడతానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్... కనిపించకుండా పోయారని ఎద్దేవా చేశారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం సందర్భంగా మాట్లాడుతూ వంటేరు పైవ్యాఖ్యలు చేశారు.
Harish Rao
KCR
KTR
vanteru pratap reddy

More Telugu News