Chandrababu: కోడికత్తి నన్నేమీ చేయలేదు.. కోడికత్తి పార్టీని నమ్మవద్దు: చంద్రబాబు

  • కోడికత్తి విషయంలో వైసీపీ పరువు పోగొట్టుకుంది
  • కోడికత్తిని మోదీ కత్తిలా వాడుకోవాలనుకుంటున్నారు
  • రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనైనా కలవాలి
కోడికత్తిని ప్రధాని మోదీ కత్తిలా వాడుకోవాలని అనుకుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎద్దేవా చేశారు. కోడికత్తి తనను ఏమీ చేయలేదని అన్నారు. కోడికత్తి పార్టీతో జతకట్టాలని మోదీ చూస్తున్నారని... కోడికత్తి పార్టీని నమ్మవద్దని చెప్పారు. కోడికత్తి విషయంలో అనవసరమైన రాద్ధాంతం చేసి, వైసీపీ పరువు పోగొట్టుకుందని అన్నారు.

తెలంగాణలో మహాకూటమి ఏర్పాటు చేసిన తర్వాత అక్కడి నాయకుడితో పాటు, మోదీకి వణుకు పుట్టిందని చెప్పారు. అవసరం అనుకున్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితో అయినా కలవాలని చంద్రబాబు తెలిపారు. వ్యక్తిగత ప్రయోజనాల కన్నా దేశ ప్రయోజనాలే రాజకీయాల్లో ముఖ్యమని చెప్పారు.
Chandrababu
modi
kcr
ysrcp

More Telugu News