hansika: గ్లామర్ పాత్రలు చేయనంటున్న హన్సిక!

  • నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తా
  • పెళ్లికి అప్పుడే తొందరేమీ లేదు
  • అమ్మ ఎవర్ని చేసుకోమంటే వారిని చేసుకుంటా
చిన్న వయసులోనే సీనీ రంగ ప్రవేశం చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో హన్సిక ఒకరు. తెలుగులో ఆమె నటించిన 'దేశముదురు' చిత్రం ఓ ఊపు ఊపిన సంగతి తెలిసిందే. గ్లామర్ గా కనిపించేందుకు కూడా అడ్డు చెప్పకపోవడంతో ఆమెకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. కొంత కాలం తర్వాత తెలుగు సినిమా అమెకు తగ్గిపోయాయి. ఇదే సమయంలో తమిళ తంబీలు ఆమెను అగ్ర స్థాయికి తీసుకెళ్లారు. ఇప్పుడు అక్కడ కూడా అవకాశాలు తగ్గాయి. మరోవైపు, హన్సిక పెళ్లికి సిద్ధమవుతోందనే వార్తలు కూడా షికారు చేస్తున్నాయి.

ఈ వార్తలపై హన్సిక స్పందిస్తూ, తన వయసు ఇంకా 27 సంవత్సరాలేనని... పెళ్లికి తొందరేం లేదని చెప్పింది. తన పెళ్లి విషయాన్ని అమ్మే చూసుకుంటుందని తెలిపింది. అమ్మ ఎవరిని చేసుకోమంటే అతన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఏడాది కాలంలో 18 కథలు విన్నానని... అందులో నాలుగింటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని తెలిపింది. మిగిలినవన్నీ గ్లామర్ పాత్రలేనని... ఇకపై గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే చేస్తానని తెలిపింది. 
hansika
tollywood
kollywood
marriage

More Telugu News