శబరిమలలో మళ్లీ ఉద్రిక్త వాతావరణం.. 5 వేల మంది పోలీసుల మోహరింపు
- 5వ తేదీ సాయంత్రం తెరుచుకోనున్న శబరిమల
- ఈరోజు నుంచే 144 సెక్షన్ అమలు
- విధుల్లో ఇద్దరు ఐజీలు, ఐదుగురు ఎస్పీలు, 10 మంది డీఎస్పీలు
ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ఆలయ పరిసర ప్రాంతాల్లో మొత్తం 5000 మంది పోలీసులను మోహరింపజేశారు. పంబ, ఇల్లువంగళ్, నీలక్కళ్ లలో ఈరోజు నుంచే 144 సెక్షన్ ను అమలు చేస్తున్నారు. భక్తులు, మీడియా ప్రతినిధులను తప్ప మరెవరినీ నీలక్కళ్ నుంచి పంబకు అనుమతించబోమని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. ఇద్దరు ఐజీలు, ఐదుగురు ఎస్పీలు, 10 మంది డీఎస్పీలు విధులు నిర్వహిస్తున్నారు.