చంద్రబాబులాంటి మోసగాడు మరొకరు లేరు.. టీఆర్ఎస్ కే నా ఓటు: పోసాని కృష్ణమురళి
- బతికినంత కాలం చంద్రబాబు నిజం చెప్పరు
- దేశంలో ఉన్న గొప్ప సీఎంలలో కేసీఆర్ ఒకరు
- హైదరాబాదులోని ఆంధ్రులు చంద్రబాబును నమ్మరాదు
ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ, తాను టీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తానని చెప్పారు. తక్కువ వ్యవధిలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన ఘనత కేసీఆర్ ది అని కితాబిచ్చారు. దేశంలో ఉన్న గొప్ప ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ ఒకరని అన్నారు. చంద్రబాబు చెప్పే మాటలను హైదరాబాదులో ఉంటున్న ఆంధ్రులు నమ్మరాదని కోరారు. బాబుకు ఓటు వేస్తే మనం మరో 50 ఏళ్లు వెనక్కి వెళతామని చెప్పారు.