anchor: మహిళలను కించపరుస్తున్న యాంకర్ ప్రదీప్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి: రాయలసీమ మహిళా సంఘ్

  • 'పెళ్లిచూపులు' కార్యక్రమం మహిళలను కించపరిచేలా ఉంది
  • ఆడవాళ్లను అంగడి సరుకుగా చూపిస్తున్నారు
  • సుమపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
ఓ టీవీ ఛానల్ లో ప్రసారమవుతున్న 'పెళ్లిచూపులు' కార్యక్రమం మహిళలను కించపరిచేలా ఉందని... ఆ కార్యక్రమాన్ని రద్దు చేయాలని రాయలసీమ మహిళా సంఘ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కర్నూలు కలెక్టరేట్ వద్ద మహిళలు ధర్నా చేపట్టారు. ఆడవాళ్లను అంగడి సరుకుగా చూపుతున్నారని... యాంకర్ ప్రదీప్, సుమ, చానల్ యాజమాన్యం మహిళల మనోభావాలను దెబ్బతీస్తున్నారని వారు మండిపడ్డారు. ప్రదీప్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, సుమ, చానల్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జేసీ పి.రవికి వినతిపత్రం సమర్పించారు. 
anchor
pradeep
suma
pellichoopulu
protest

More Telugu News