venkatesh: రైల్వే కూలీలుగా వెంకీ .. వరుణ్!

షార్ట్స్‌లో చూడండి
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కథానాయకులుగా నటిస్తున్నారు. పూర్తి వినోదాత్మకంగా నిర్మితమవుతోన్న ఈ సినిమాకి 'ఎఫ్ 2' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణ జరుపుకుంది. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో వెంకటేశ్ సరసన తమన్నా .. వరుణ్ తేజ్ జోడీగా మెహ్రీన్ నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి అనిల్ రావిపూడి ఒక ఆసక్తికరమైన ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోను బట్టి ఈ సినిమాలో వెంకటేశ్ .. వరుణ్ తేజ్ రైల్వే కూలీలుగా కనిపించనున్నట్టు తెలుస్తోంది. అయితే సినిమాలో 'ఫన్' కోసం వీళ్లు రైల్వే కూలీలుగా అవతారమెత్తారా? లేదంటే సినిమా మొత్తం ఇలాగే కనిపించనున్నారా? అనేదే ఆసక్తికరంగా మారింది. ఆల్రెడీ 'కూలీ నెంబర్ 1' సినిమాలో వెంకటేశ్ రైల్వే కూలీగా కనిపించి మాస్ ఆడియన్స్ ను మెప్పించాడు. ఇక ఈ సారి రైల్వే కూలీగా ఆయన చేసే సందడి ఎలా వుంటుందో చూడాలి.  
Go Back to Shorts
venkatesh
varun

More Telugu News