Andhra Pradesh: చంద్రబాబు రాజకీయ విధానం ఇదే.. ట్విట్టర్ లో నిప్పులు చెరిగిన పవన్ కల్యాణ్!

  • అవకాశవాద రాజకీయాలు ఆయన నైజం
  • దాన్ని ఓ ఆచారంగా మార్చుకున్నారు
  • ప్రతిపక్ష నేతపై దాడి విషయంలో వెకిలి నవ్వులా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయాలు చేయడంలో ఉద్ధండుడని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. ఇలా అవకాశవాద రాజకీయాలకు పాల్పడటం  చంద్రబాబుకు ఆచారంగా మారిపోయిందని దుయ్యబట్టారు. ఈ మేరకు ట్విట్టర్ లో పవన్ కల్యాణ్ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. గతంలో వేర్వేరు సందర్భాల్లో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీని ఎండగడుతూ చేసిన వ్యాఖ్యల క్లిప్ ను ఈ ట్వీట్ కు పవన్ జత చేశారు.

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై విశాఖపట్నం ఎయిర్ పోర్టులో దాడి జరగడం దురదృష్టకరమని పవన్ నిన్న వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దాడి అంశంపై సరైన రీతిలో స్పందించాల్సిన చంద్రబాబు... వెకిలిగా నవ్వుతూ మాట్లాడుతుండటం దారుణమని చెప్పారు. దాడి ఘటనను లోతుగా విచారించాలన్నారు. కావాలని నిందితుడు దాడి చేశాడా? లేక ఇతరుల ప్రమేయం ఉందా? అనే కోణంలో విచారించాలని డిమాండ్ చేశారు.
Andhra Pradesh
Pawan Kalyan
Chandrababu
Jagan
Twitter
Jana Sena
Visakhapatnam District

More Telugu News