Andhra Pradesh: పశ్చిమగోదావరిలో బోల్తా కొట్టిన బస్సు.. లారీని ఓవర్ టేక్ చేయబోయి దారుణం!

  • పల్టీ కొట్టడంతో 10 మందికి గాయాలు
  • ఏలూరు బైపాస్ రోడ్డుపై ఘటన
  • క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన వైద్యులు
పశ్చిమగోదావరి జిల్లాలో ఈ రోజు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి ఏలూరు బైపాస్ రోడ్డుపై వెళుతున్న కేవీఆర్ ట్రావెల్స్ బస్సు లారీని ఓవర్ టేక్ చేయబోయి ఈరోజు ఉదయం బోల్తా కొట్టింది. దీంతో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రయాణికులు అందించిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం వీరందరూ డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ప్రమాద సమయంలో 45 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. లారీ ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదపు తప్పి పల్టీ కొట్టిందని వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని స్పష్టం చేశారు.
Andhra Pradesh
West Godavari District
Road Accident
bus
lorry
ruck
overtake

More Telugu News