Rahul Gandhi: ఏపీలో పొత్తులపై రాహుల్-చంద్రబాబు మధ్య చర్చలు జరగలేదు: రఘువీరారెడ్డి

  • జాతీయ అంశాల ప్రాతిపదికనే నిన్నటి భేటీ జరిగింది
  • చంద్రబాబు ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నాం
  • ‘హోదా’ కావాలనుకునే పార్టీలన్నీ మాతో కలిసి రావాలి
ఏపీలో పొత్తులపై రాహుల్- చంద్రబాబు మధ్య చర్చలు జరగలేదని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. కేవలం జాతీయ అంశాల ప్రాతిపదికనే నిన్న ఢిల్లీలో రాహుల్ - చంద్రబాబుల భేటీ జరిగిందని చెప్పారు. బీజేపీని గద్దె దింపేందుకు, కాంగ్రెస్ తో కలిసి పనిచేసేందుకు చంద్రబాబు ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపే కూటమికి రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తారని, ఏపీకి ప్రత్యేక హోదా కావాలనుకునే పార్టీలన్నీ తమ పార్టీతో కలిసిరావాలని కోరారు.
Rahul Gandhi
Chandrababu
raghuveera reddy

More Telugu News