Jagan: జగన్‌పై దాడి కేసు నిందితుడి రిమాండ్ గడువు పొడిగింపు

  • నేటితో ముగిసిన శ్రీనివాస్ పోలీస్ కస్టడీ
  • నిందితుడి కాల్‌డేటా ఆధారంగా విచారణ
  • ఈనెల 9వరకూ రిమాండ్ గడువు పొడిగింపు
ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావు రిమాండ్ గడువును న్యాయస్థానం పొడిగించింది. శ్రీనివాస్ పోలీస్ కస్టడీ నేటితో ముగిసింది. కానీ నేటి వరకూ ఈ కేసులో ఆశించిన పురోగతిని పోలీస్ అధికారులు సాధించలేకపోయారు. నిందితుడు అసలు విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని పోలీసులు చెబుతున్నారు.

అతని తల్లిదండ్రులు ప్రశ్నించినప్పటికీ కన్నీళ్ల పర్యంతమయ్యాడే తప్ప నిజానిజాలేమీ వెల్లడించలేదని సమాచారం. ప్రస్తుతం నిందితుడి కాల్ డేటా ఆధారంగా విచారణ కొనసాగుతోంది. కేసుకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదిక కూడా అందలేదు. దీంతో నిందితుడికి కస్టడీ పొడిగించాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరడంతో ఈ నెల 9 వరకూ నిందితుడి రిమాండ్ గడువును న్యాయమూర్తి పొడిగించారు.
Jagan
Srinivasa Rao
Forencic Report
Court
Custody

More Telugu News