komatireddy: నన్ను చంపేందుకు టీఆర్ఎస్ యత్నిస్తోంది: కోమటిరెడ్డి

షార్ట్స్‌లో చూడండి
తనను చంపాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని టీకాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తొలుత తన అనుచరులను మట్టుబెట్టి, ఆ తర్వాత తనను చంపేందుకు కుట్రలు పన్నుతోందని చెప్పారు. గడపగడపకు ప్రచార కార్యక్రమంలో భాగంగా నల్గొండలోని 13వ వార్డులో ఈరోజు ఆయన ప్రచారం నిర్వహించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. కేసీఆర్ చెప్పిన బంగారు తెలంగాణ వారి కుటుంబానికే పరిమితమైందని విమర్శించారు. మన బతుకులను మనమే మార్చుకోవాలని... ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఇంటికి పంపించాలని కోరారు.

Go Back to Shorts
komatireddy
kcr
congress
TRS

More Telugu News