pawan kalyan: కాంగ్రెస్ తో పొత్తు చంద్రబాబు అధికార దాహానికి నిదర్శనం!: పవన్ కల్యాణ్

  • జగన్ పై దాడి అంశంపై ప్రభుత్వం వెకిలిగా మాట్లాడుతోంది
  • అన్నయ్య కాంగ్రెస్ లో ఉన్నా.. నేను టీడీపీకి మద్దతు ఇచ్చా
  • ప్రజా సమస్యలను తెలుసుకోవడానికే నా యాత్రలు
వైసీపీ అధినేత జగన్ పై దాడి అంశంపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. రాష్ట్ర ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తిపై దాడి జరగడం దురదృష్టకరమని అన్నారు. దాడి అంశంపై సరైన రీతిలో స్పందించాల్సిన ప్రభుత్వం... వెకిలిగా మాట్లాడుతుండటం దారుణమని చెప్పారు. దాడి ఘటనను లోతుగా విచారించాలని అన్నారు. కావాలని నిందితుడు దాడి చేశాడా? లేక ఇతరుల ప్రమేయం ఉందా? అనే కోణంలో విచారించాలని సూచించారు. దాడి వెనక కుట్ర ఏమైనా ఉందా అనే విషయం విచారణలో తేలాలని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు దారుణమని... ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార దాహానికి ఇదొక నిదర్శనమని అన్నారు. అన్నయ్య చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ... రాష్ట్రం కోసం తాను టీడీపీకి మద్దతిచ్చానని చెప్పారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ప్రజాసమస్యలను తెలుసుకోవడానికే తాను యాత్రలు చేస్తున్నానని... అధికారం కోసం కాదని చెప్పారు. 
pawan kalyan
Telugudesam
janasena
congress
Chandrababu
Chiranjeevi

More Telugu News