karthikeya: రామ్ చరణ్ గురించి 'ఆర్ ఎక్స్ 100' హీరో

  • చరణ్ చాలా కష్టపడతాడు 
  • చిరంజీవి కొడుకుననే గర్వం లేదు 
  • విజయ్ దేవరకొండలో ఫ్యాన్స్ కి నచ్చేది అదే 
తొలి సినిమా 'ఆర్ ఎక్స్ 100'తో హీరోగా కార్తికేయ మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తరువాత సినిమాకి సంబంధించిన పనుల్లో ఆయన బిజీగా వున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన అభిమానులతో లైవ్ చాట్ ను నిర్వహించాడు. ఈ సందర్భంలోనే ఒక అభిమాని చరణ్ గురించి చెప్పమని అడిగాడు.

అప్పుడు కార్తికేయ స్పందిస్తూ .. "చరణ్ చాలా గొప్ప డాన్సర్ .. మంచి నటుడు. చిరంజీవి కొడుకుననే గర్వం ఆయనలో కొంచెం కూడా కనిపించదు. ప్రతి సన్నివేశం అనుకున్నట్టుగా రావడానికి ఆయన చాలా కష్టపడుతుంటాడు. చిరంజీవి కొడుకైన ఆయనే అంతగా కష్టపడుతుంటే, మనం ఇంకెంత కష్టపడాలి? అనిపిస్తూ ఉంటుంది. ఇక మరో అభిమాని విజయ్ దేవరకొండ గురించి చెప్పుమనగా, 'ఏదైనా సాధ్యమే .. ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లొచ్చు' అనే ఆశాభావాన్ని విజయ్ దేవరకొండ నుంచి నేర్చుకోవచ్చు. ఆయనలో అభిమానులకి నచ్చింది కూడా ఇదే' అంటూ చెప్పుకొచ్చాడు. 
karthikeya

More Telugu News