jagan: జగన్ పై దాడి కేసులో ట్విస్ట్.. డీజీపీ, విశాఖ కమిషనర్ లకు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు

  • శ్రీనివాస్ కు ప్రాణహాని ఉందన్న నేపథ్యంలో వివరణ కోరిన కమిషన్
  • నేటితో ముగియనున్న శ్రీనివాస్ కస్టడీ
  • విచారణలో కీలక ఆధారాలు లభ్యం
వైసీపీ అధినేత జగన్ పై కోడికత్తితో దాడి కేసుపై జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది. ఏపీ డీజీపీ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్ లకు నోటీసులు జారీ చేసింది. నిందితుడు శ్రీనివాస్ కు ప్రాణహాని ఉందన్న నేపథ్యంలో వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. మరోవైపు, శ్రీనివాస్ కస్టడీ నేటితో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో, కస్టడీని పొడిగించాలని కోర్టును పోలీసులు కోరనున్నారు. మరోవైపు, విచారణలో కొన్ని ముఖ్యమైన ఆధారాలు లభ్యమయినట్టు సమాచారం. 
jagan
srinivas
ap dgp
visakha commissioner
sc commission

More Telugu News