Chandrababu: ఆ సామర్థ్యం చంద్రబాబుకు ఉంది: లగడపాటి

  • ఎంతో అనుభవం ఉన్న నేత చంద్రబాబు
  • పార్టీలను కలపడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు
  • కాంగ్రెస్, టీడీపీలు ప్రత్యర్థులు కాదు
సైద్ధాంతిక విభేదాలు ఉన్న పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే సామర్థ్యం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉందని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. గతంలో కూడా అన్ని పార్టీలను ఒకే గొడుగు కిందకు తెచ్చిన చరిత్ర చంద్రబాబుదని తెలిపారు. ఎంతో అనుభవం ఉన్న నేత ఆయన అని కొనియాడారు. దివంగత ఎన్టీఆర్ కు కూడా జాతీయ స్థాయిలో ఫ్రంట్ ను ఏర్పాటు చేసిన ఘనత ఉందని చెప్పారు.

కాంగ్రెస్, టీడీపీల మధ్య పొత్తులో కొత్తదనం ఏమీ లేదని లగడపాటి అన్నారు. ఏ రాష్ట్రంలో కూడా టీడీపీ, కాంగ్రెస్ లు శత్రువులు కావని తెలిపారు. ఈ రెండు పార్టీల కలయికలో అసాధారణమైన అంశం ఏమీ లేదని చెప్పారు. గతంలో వివిధ పార్టీలను కలిపిన చంద్రబాబు... ఇప్పుడు మరోసారి ఆ ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రాజకీయ పరిస్థితులను బట్టి పార్టీలు కలవడం సాధారణ అంశమేనని... బీహార్ లో బద్ధవైరులు కలిశారని గుర్తు చేశారు. సాధారణంగా ప్రత్యర్థులు కలుసుకోవడం ఉండదని... కానీ, కొత్త ప్రత్యర్థి వచ్చినప్పుడు, పాత ప్రత్యర్థులు కలవడం ఎప్పుడూ జరిగేదే అని చెప్పారు. 
Chandrababu
mahakutami
lagadapati

More Telugu News