Chandrababu: 1982 స్థాపితం - 2018 భూస్థాపితం: టీడీపీపై కన్నా లక్ష్మీనారాయణ సెటైర్

  • చంద్రబాబు, రాహుల్ భేటీపై విమర్శలు
  • ఇది అవకాశవాద కలయిక
  • ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్నారని మండిపాటు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలసి కూటమిని ఏర్పాటు చేయడంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిప్పులు చెరిగారు. 1982లో స్థాపితమైన తెలుగుదేశం పార్టీ, 2018లో భూస్థాపితమైందని తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు.

"తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో స్వర్గీయ ఎన్టీఆర్ గారిచే టీడీపీ స్థాపితం :1982... కుటిల రాజకీయ ప్రయోజనాలతో చంద్రబాబు గారిచే టీడీపీ భూస్థాపితం:2018" అని ఆయన ట్వీట్ చేశారు. ఆపై "ఈమధ్య జరిగిన ఆదాయపు పన్ను దాడుల వలన బాబు గారిలో కలిగిన అభద్రత భావం పునాదిగా ఏర్పడిన పరస్పర వ్యతిరేక ధ్రువాల అవకాశవాద కలయిక. ఈ కలయిక దేశ ప్రయోజనాల కోసం అని ప్రజలకు భ్రమ కల్పించటం వారి చెవిలో పువ్వు పెట్టాలని చూడటమే అవుతుంది. ప్రజలు అంత అమాయకంగా లేరు" అని ఆయన పేర్కొన్నారు.
Chandrababu
Rahul Gandhi
Kanna
Twitter

More Telugu News