Rahul Gandhi: రాహుల్ గాంధీతో చర్చలు ఫలప్రదంగా సాగాయి: సీఎం చంద్రబాబు

  • ఇప్పటికే కొంత మందితో చర్చించాం
  • మరికొంత మందితో చర్చించాల్సి ఉంది
  • చర్చలన్నీ కొలిక్కి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, సభలు
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చలు ఫలప్రదంగా సాగాయని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటికే కొంత మందితో చర్చించామని, మరికొంత మందితో చర్చించాల్సి ఉందని అన్నారు. చర్చలన్నీ కొలిక్కి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తామని చెప్పారు.

గతంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో విభేదించిన సందర్భాలు ఉన్నాయని, వ్యవస్థలు గాడి తప్పినప్పుడు ప్రత్యామ్నాయం సృష్టించడంలో తాము ముందుంటామని, విపక్షాల ఐక్యతకు ఎవరో ఒకరు చొరవ తీసుకోవాలి కనుక తాను ముందుండి నడిచానని స్పష్టం చేశారు. అవసరమైన ప్రతిసారి దేశ రాజకీయాల్లో టీడీపీ కీలక పాత్ర పోషించిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వ విధానల వల్ల ప్రజలు చాలా బాధపడుతున్నారని, ఏపీ ప్రయోజనాలతో పాటు దేశ ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని చంద్రబాబు అన్నారు.
Rahul Gandhi
Chandrababu
delhi

More Telugu News