manjubhargavi: కలలో వేంకటేశ్వరస్వామి కనిపించాడు: మంజు భార్గవి
- నాకు వేంకటేశ్వరస్వామి అంటే ఇష్టం
- నేను ఆయన భక్తురాలిని
- ఆ స్వామి ఫోటో చూస్తూ ఒక మాట అడిగాను
అనేక నృత్య ప్రదర్శనలతో .. విభిన్నమైన పాత్రలతో మంజు భార్గవి ఎంతోమంది మనసులను గెలుచుకున్నారు. అలాంటి మంజు భార్గవి .. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, ఒక ఆసక్తికరమైన విషయం చెప్పుకొచ్చారు. "చిన్నప్పటి నుంచి కూడా నాకు వేంకటేశ్వరస్వామి అంటే ఇష్టం. సహజంగానే ఆయన ఫోటోలు ప్రతి ఒక్కరి ఇళ్లలోనూ ఉంటాయి.
మా ఇంట్లో నేను పడుకుని .. ఎదురుగా గోడకి వున్న వేంకటేశ్వరస్వామి ఫోటోను చూశాను. స్వామివారి ఒక చేయి వంపు తిరిగి నడుము మీదకి ఉంటుంది. ఆ చేయిని అలా పెట్టుకుని ఉండటం వలన నొప్పి కలగడం లేదా? అని నేను ఆ ఫోటో వంక చూస్తూ అడిగాను. మీరు నమ్మరు .. ఆ రాత్రి ఆయన నా కలలోకి వచ్చి .. నన్ను దగ్గరికి తీసుకున్నారు. నాకు 11 ఏళ్ల వయసులో ఈ సంఘటన జరిగింది. ఇప్పుడు చెప్పండి నేను ఆయన భక్తురాలినా .. కాదా?" అంటూ ఆమె నవ్వేశారు.