Chandrababu: ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు... నేరుగా శరద్ పవార్ నివాసానికి పయనం

  • కాసేపట్లో పవార్ నివాసానికి చేరుకోనున్న ఫరూక్ అబ్దుల్లా
  • విందు సందర్భంగా పలు అంశాలపై చర్చలు
  • 3 గంటల సమయంలో చంద్రబాబుతో భేటీ కానున్న రాహుల్ గాంధీ
జాతీయ స్థాయిలో మహాకూటమిని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసానికి బయల్దేరారు. కాసేపట్లో నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా కూడా అక్కడకు చేరుకోనున్నారు.

విందు సమావేశం సందర్భంగా జాతీయ స్థాయిలో వివిధ రాజకీయ అంశాలపై వీరు చర్చించనున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి, బీజేపీకి వ్యతిరేకంగా ఒక సెక్యులర్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసే దిశగా వీరి చర్చలు సాగనున్నాయి. అనంతరం 3 గంటల సమయంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా ఇక్కడకు వచ్చి చంద్రబాబుతో సమావేశం కానున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో దేశ రాజధానిలో రాజకీయ వేడి పెరిగింది.
Chandrababu
delhi
sharad pawar
farooq abdullah
Rahul Gandhi

More Telugu News