Statue of Unity: ఆయనే బతికుంటే ఎలా స్పందించేవారో... హాట్ టాపిక్ గా మారిన హీరో నిఖిల్ ట్వీట్!

  • సామాజిక, రాజకీయ అంశాలపై స్పందించే నిఖిల్
  • సర్దార్ బతికుంటే విగ్రహ ఖర్చు చూసి ఏమనేవారో?
  • తనకు తెలియడం లేదన్న నిఖిల్
ఇటీవలి కాలంలో సమకాలీన సామాజిక, రాజకీయ అంశాలపై స్పందిస్తూ ట్వీట్లు చేస్తున్న నటుడు నిఖిల్, తాజాగా సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారక 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' విగ్రహంపై స్పందించాడు. ఈ విగ్రహం తయారీకి సుమారు రూ. 3 వేల కోట్లు వెచ్చించిన నేపథ్యంలో, ఇంత ఖర్చు ఎందుకన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించాడు.

"దేశ‌మంత‌టినీ ఐక్యంగా ఉంచిన ఘ‌న‌త క‌చ్చితంగా స‌ర్దార్‌ కే చెందుతుంది. ఆయ‌న చేసిన కృషికి క‌చ్చితంగా త‌గిన గుర్తింపు ఇవ్వాల్సిందే. అయితే, ఆయ‌నే గ‌నుక బ‌తికి ఉంటే త‌న విగ్ర‌హ ఏర్పాటుకు అయిన ఖ‌ర్చును చూసి ఎలా స్పందించేవారో? తెలియ‌డం లేదు" అని ట్వీట్ చేశాడు. ఇప్పుడు నిఖిల్ ట్వీట్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది.
Statue of Unity
Nikhil
Vallabhai Patel
Twitter

More Telugu News