kishan reddy: ఇప్పుడున్నది నారా టీడీపీ: కిషన్ రెడ్డి

  • కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు అనైతికం
  • ఈ పొత్తును ఎన్టీఆర్ అభిమానులు నిలదీయాలి
  • చంద్రబాబుకు అధికారమే పరమావధి
కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు అనైతికమని బీజేపీ నేత కిషన్ రెడ్డి అన్నారు. ఇది ముమ్మాటికీ ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తాకట్టుపెట్టడమేనని విమర్శించారు. ప్రస్తుతం ఉన్నది నందమూరి టీడీపీ కాదని, నారా టీడీపీ అని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీల కలయికను ఎన్టీఆర్ అభిమానులు ప్రశ్నించాలని అన్నారు. చంద్రబాబుకు అధికారమే పరమావధి అని... ఆ కోణంలోనే ఆయన రాజకీయాలు ఉంటాయని చెప్పారు. అధికారం కోసం దేనికైనా చంద్రబాబు సిద్ధపడతారని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ఖాయమని చెప్పారు.
kishan reddy
Chandrababu
bjp
Telugudesam
congress

More Telugu News