jagan: జగన్ పిటిషన్ విచారణను వాయిదా వేసిన హైకోర్టు

  • స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలంటూ జగన్ పిటిషన్
  • దాడికి సంబంధించి మరో రెండు పిటిషన్లు వేసిన వైవీ సుబ్బారెడ్డి, అరుణ్ కుమార్
  • విచారణకు స్వీకరించిన హైకోర్టు
వైసీపీ అధినేత జగన్ పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడిపై దాఖలు చేసిన పిటిషన్ల విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. దాడి ఘటనపై స్వతంత్ర సంస్థతో విచారణ చేయించాలంటూ జగన్ పిటిషన్ వేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదని, రాజకీయ కోణంలో విచారణ జరుగుతోందని పిటిషన్ లో జగన్ ఆరోపించారు.

తనపై కుట్ర పూరితంగానే దాడి జరిగిందని... ఆ కోణంలో విచారణ జరిపించాలని ఆయన కోరారు. మరోవైపు దాడికి సంబంధించి వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, అరుణ్ కుమార్ లు మరో రెండు పిటిషన్లు వేశారు. ఈ మూడు పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు... తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. 
jagan
stab
high court
hearing

More Telugu News