Odisha: పదేళ్ల బాలికపై దోపిడీ దొంగల గ్యాంగ్ రేప్.. కుటుంబ సభ్యుల ముందే దారుణం!

షార్ట్స్‌లో చూడండి
ఒడిశా రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి గంజాం జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఓ ఇంట్లోకి చొరబడి దోచుకోవడంతో పాటు నిద్రపోతున్న పదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. దీంతో తీవ్ర అస్వస్థతకు లోనైన బాలికను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు.

జిల్లాలోని డొయికనా గ్రామంలో ఈ రోజు తెల్లవారుజామున నలుగురు దొంగలు ఓ ఇంట్లోకి ప్రవేశించారు. కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కారు. అనంతరం ఇంట్లోని సొత్తును దోచుకున్నారు. వెళుతూవెళుతూ అక్కడే నిద్రపోతున్న పదేళ్ల బాలికపై కుటుంబ సభ్యుల ముందే తమ మృగవాంఛను తీర్చుకున్నారు.

ఆ తర్వాత ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. ఈ ఘటనతో బాధితురాలు తీవ్ర అస్వస్థతకు లోనయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
Go Back to Shorts
Odisha
thives
10 year girl
gang rape
Police
ganjam district

More Telugu News