Mahesh Babu: 'మహర్షి' కోసం భారీ విలేజ్ సెట్ సిద్ధం

షార్ట్స్‌లో చూడండి
మహేశ్ బాబు తన 25వ సినిమాగా 'మహర్షి' చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్, కొంతకాలంగా యూఎస్ లో జరుగుతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా టీమ్ అక్కడి నుంచి హైదరాబాద్ కి తిరిగిరానుంది. తదుపరి షెడ్యూల్ ను ఇక్కడే చిత్రీకరించనున్నారు. గ్రామీణ నేపథ్యంలో మహేశ్ బాబు .. పూజా హెగ్డే .. అల్లరి నరేశ్ తదితరులపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అందుకోసం భారీగా విలేజ్ సెట్ ను సిద్ధం చేస్తున్నారు. నిజంగా విలేజ్ లోనే షూట్ చేశారు అనిపించేలా ఈ సెట్ ను తీర్చిదిద్దుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలను సమకూర్చుతోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నారు. మహేశ్ అభిమానులంతా ఈ సినిమా కోసమే వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.      
Go Back to Shorts
Mahesh Babu
pooja hegde

More Telugu News