Jagan: అమ్మానాన్నలను చూసి ఏడుపు... కీలక వ్యక్తుల పేర్లు చెప్పిన శ్రీనివాసరావు!

  • ఐదు రోజులుగా నోరు విప్పని శ్రీనివాసరావు
  • తల్లిదండ్రుల ముందు విచారణలో పలు ప్రశ్నలకు సమాధానాలు
  • వారి ముందే విచారిస్తున్న పోలీసులు
గడచిన ఐదు రోజులుగా పోలీసుల విచారణలో పెద్దగా నోరువిప్పని జగన్ పై దాడి కేసు నిందితుడు శ్రీనివాసరావు నేడు నోరువిప్పి కొందరు కీలక వ్యక్తుల పేర్లను చెప్పినట్టుగా తెలుస్తోంది. తన తల్లిదండ్రులను చూడాలని వుందని శ్రీనివాసరావు కోరడంతో, వారిని పిలిపించిన పోలీసులు, వారి ముందు శ్రీనివాసరావును ప్రశ్నలు వేసి, సమాధానాలు రాబట్టారు. తల్లిదండ్రులను చూడగానే ఉద్వేగానికి గురై, శ్రీనివాసరావు బోరున విలపించినట్టు సమాచారం. ఆపై అతన్ని 3 గంటల పాటు సిట్ ప్రత్యేక దర్యాఫ్తు బృందం ప్రశ్నించింది. తల్లిదండ్రులు పక్కన ఉంటే, తమ ప్రశ్నలకు సమాధానాలు వస్తున్నాయని భావిస్తున్న పోలీసులు, అతని మానసిక స్థితిని కూడా అంచనా వేస్తున్నారు.
Jagan
Srinivasa Rao
Father
Mother
Vizag

More Telugu News