'మహానటి'కి దక్కిన మరో గౌరవం!
- నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం
- 49వ ఐఎఫ్ఎఫ్ఐలో ప్రదర్శనకు ఎంపిక
- దక్షిణాది నుంచి ఒకే ఒక్క చిత్రంగా నిలిచిన 'మహానటి'
ఈ నెలలో గోవాలో ఉత్సవాలు జరుగనుండగా, వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా తెరకెక్కించిన 'మహానటి'తో పాటు పలు భారతీయ భాషల నుంచి 22 చిత్రాలు నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ప్రదర్శించబడుతున్నాయి. ఇక 'మహానటి' ఎంపికైన విషయాన్ని స్వప్న సినిమాస్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. గోవాలో ఐఎఫ్ఎఫ్ఐ చిత్రోత్సవాలు ఈ నెల 20 నుంచి 28 వరకూ జరుగనున్నాయి.