IFFI: 'మహానటి'కి దక్కిన మరో గౌరవం!

  • నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం
  • 49వ ఐఎఫ్ఎఫ్ఐలో ప్రదర్శనకు ఎంపిక
  • దక్షిణాది నుంచి ఒకే ఒక్క చిత్రంగా నిలిచిన 'మహానటి'
అందాల నటి కీర్తి సురేష్ అద్భుతంగా నటించగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కి, సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న సావిత్రి బయోపిక్ 'మహానటి' మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. 49వ ఐఎఫ్ఎఫ్ఐ (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా)లో మెయిన్ స్ట్రీమ్ లో దక్షిణాది నుంచి ప్రదర్శనకు ఎంపికైన ఒకే ఒక్క చిత్రంగా నిలిచింది.

ఈ నెలలో గోవాలో ఉత్సవాలు జరుగనుండగా, వైజ‌యంతీ మూవీస్‌, స్వ‌ప్న సినిమాస్ సంయుక్తంగా తెర‌కెక్కించిన 'మహానటి'తో పాటు పలు భారతీయ భాషల నుంచి 22 చిత్రాలు నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ప్రదర్శించబడుతున్నాయి. ఇక 'మహానటి' ఎంపికైన విషయాన్ని స్వప్న సినిమాస్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. గోవాలో ఐఎఫ్ఎఫ్ఐ చిత్రోత్సవాలు ఈ నెల 20 నుంచి 28 వరకూ జరుగనున్నాయి.
IFFI
Mahanati
Goa

More Telugu News