Srinivasa rao: శ్రీనివాస్ ఫోన్ కాల్స్ ఆధారంగా మధ్యప్రదేశ్‌కు పోలీసు బృందాలు

  • శ్రీనివాసరావు ఫోన్ కాల్స్ డేటాను విశ్లేషిస్తున్న పోలీసులు
  • సెక్షన్ 160 నోటీసులకు స్పందించని వైసీపీ నేతలు
  • విచారణ కోసం జగన్ ధరించిన చొక్కా కావాలన్న పోలీసులు
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై దాడిచేసిన శ్రీనివాసరావు ఫోన్ కాల్స్‌ డేటాను విశ్లేషిస్తున్న పోలీసులు వాటి ఆధారంగా మధ్యప్రదేశ్‌కు పోలీసు బృందాలను పంపారు. శ్రీనివాసరావు ఎక్కువగా ఎవరితో మాట్లాడాడో వారిని పిలిపించి మాట్లాడుతున్నట్టు ఏసీపీ అర్జున్ తెలిపారు.

ఈ మధ్యకాలంలో అతడు 321 కాల్స్ మాట్లాడాడని చెప్పారు. అతడి ఫోన్ కాల్స్ ఆధారంగా మధ్యప్రదేశ్‌కు పోలీసు బృందాలను పంపినట్టు చెప్పిన ఏసీపీ.. సెక్షన్ 160 నోటీసులకు వైసీపీ నేతలు స్పందించలేదన్నారు. దీంతో కోర్టులో మెమో దాఖలు చేసినట్టు చెప్పారు. అలాగే, దాడి జరిగిన సమయంలో జగన్ ధరించిన చొక్కా కావాల్సిందిగా అడిగామని పేర్కొన్నారు. నిందితుడు శ్రీనివాసరావు తల్లిదండ్రులను కూడా విచారిస్తామని ఏసీపీ అర్జున్ తెలిపారు.
Srinivasa rao
YSRCP
Jagan
knife attack
Visakhapatnam District

More Telugu News