ఆ సమయంలో చాలా బాధపడ్డా.. నాతో సహా ఐదారుగురు ఏడ్చారు: మురుగదాస్
- బాధాకర సన్నివేశాన్ని వివరించిన మురుగదాస్
- అప్పుల బాధ భరించలేక కుటుంబం ఆత్మహత్య
- సన్నివేశం పూర్తయ్యాక సెట్ అంతా నిశ్శబ్దం
ఆ సన్నివేశం నటీనటులకు తాను వివరిస్తుంటేనే చాలా బాధపడ్డానని.. సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పుడు తనతో సహా ఐదారుగురు కన్నీటి పర్యంతమయ్యారని ఆయన వివరించారు. తిరునల్వేలిలో అప్పుల బాధ భరించలేక ఒకే కుటుంబంలోని నలుగురు నిప్పంటించుకున్న సంఘటన ఆధారంగా ఆ సన్నివేశాన్ని తెరకెక్కించినట్టు మురుగదాస్ తెలిపారు. ఈ సన్నివేశం పూర్తయ్యాక ఒకరి మొహం మరొకరు చూడలేదని.. సెట్ అంతా నిశ్శబ్దం ఆవరించిందని మురుగదాస్ తెలిపారు.