Rahul Gandhi: కీలక పరిణామం..రేపు రాహుల్‌తో భేటీ కానున్న చంద్రబాబు!

  • రేపు ఢిల్లీ వేదికగా భేటీ
  • ఢిల్లీలో కీలక నేతలతో బాబు భేటీ
  • బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు యోచన
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీతో కలిసి వెళ్లేందుకు టీడీపీ అడుగులు వేస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలవనున్నారని వార్తలు వెలువడుతున్నాయి. రాజకీయ పరంగా కీలకమైన విపక్ష నేతల ఈ భేటీ రేపు ఢిల్లీలో జరగనుందని సమాచారం.

ఏపీకి అన్యాయం చేస్తున్న బీజేపీ తీరును ఎండగట్టాలని చంద్రబాబు నిర్ణయించారని, ‘సేవ్ నేషన్’ పేరుతో బీజేపీకి ప్రత్యాన్మాయంగా జాతీయ స్థాయిలో కూటమిని ఏర్పాటు చేసే యోచనలో ఆయన ఉన్నట్టు సమాచారం. అయితే రేపు ఢిల్లీ వెళ్లనున్న ఆయన ఉదయం శరద్‌ పవార్‌, ఫరూక్‌ అబ్దుల్లాతో సమావేశమవుతారు. మధ్యాహ్నం వామపక్ష నేతలు, సాయంత్రం అఖిలేష్‌ యాదవ్‌తో ఆయన భేటీకానున్నారని సమాచారం.
Rahul Gandhi
Chandrababu
Congress
Telugudesam
Andhra Pradesh
New Delhi

More Telugu News