vishal: విశాల్ తో పెళ్లి గురించి వరలక్ష్మి శరత్ కుమార్

  • 'సర్కార్' లో మంచి పాత్ర చేశాను
  • విశాల్ .. నేను స్నేహితులం మాత్రమే 
  • ఆయన ఎవరిని పెళ్లి చేసుకున్నా సంతోషమే
'పందెం కోడి 2' సినిమాతో వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. దీపావళికి రానున్న 'సర్కార్' సినిమాలోను ఆమె ఒక కీలకమైన పాత్రను పోషించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ .. ఈ సినిమాలోని పాత్ర కూడా తనకి మంచి పేరు తీసుకు వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.

చాలా తక్కువ సమయంలో రెండు భారీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువవుతున్నందుకు చాలా ఆనందంగా వుందని అంది. ఈ సమయంలోనే విశాల్ గురించిన ప్రశ్న ఆమెకి ఎదురైంది. అప్పుడు ఆమె స్పందిస్తూ .. "విశాల్ నాకు మంచి స్నేహితుడు మాత్రమే అని గతంలో చాలాసార్లు చెప్పాను. మేము ప్రేమించుకోలేదు .. డేటింగ్ చేయలేదు. విశాల్ త్వరలో పెళ్లి చేసుకోనున్నాడనే వార్తలు నేను విన్నాను. ఆయన పెళ్లి చేసుకుంటే నాకూ సంతోషమే" అని చెప్పుకొచ్చింది. 
vishal
varalakshmi

More Telugu News