hero: శివాజీ.. నిన్ను చంపేస్తారు.. ఉచ్చులో చిక్కుకోవద్దు: లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

  • శివాజీ క్యారెక్టర్ ఆర్టిస్టుకు ఎక్కువ, జోకర్ కు తక్కువ
  • టీడీపీ నేతలు అతన్ని చంపేస్తారు
  • శివాజీ ఇవన్నీ వదిలేసి, కుటుంబాన్ని మంచిగా చూసుకో
హీరో శివాజీని ఉద్దేశించి వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. శివాజీ స్థాయి క్యారెక్టర్ ఆర్టిస్టుకు ఎక్కువ, సినిమాల్లోని జోకర్ కు తక్కువని ఎద్దేవా చేశారు. టీడీపీ డైరెక్షన్ లోనే శివాజీ ఆపరేషన్ గరుడ డ్రామాను నడిపిస్తున్నారని చెప్పారు. శివాజీకి తాను ఒక్క విషయాన్ని చెప్పాలనుకుంటున్నానని...  టీడీపీ నేతలు అతన్ని చంపేస్తారని, ఆ తర్వాత హత్య చేసింది వైసీపీ అంటూ మరో డ్రామాకు తెరతీస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిన్న స్థాయి నటుడైన శివాజీని రాజకీయ చదరంగంలోకి లాగారని... ఏదో ఒక రోజు అది అతని మెడకే ఉచ్చుగా మారుతుందని చెప్పారు. ఈ రాజకీయ ఉచ్చులో చిక్కుకోకుండా, కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలని శివాజీకి ఆమె సూచించారు.
hero
sivaji
tollywood
opration garuda
lakshmi parvathi
YSRCP
Telugudesam

More Telugu News