Andhra Pradesh: ఆంధ్రాకు బీజేపీ అన్యాయం చేస్తుంటే.. వైసీపీ, జనసేన పార్టీలు వారికి కొమ్ముకాస్తున్నాయి!: టీడీపీ ఎంపీ కొనకళ్ల

  • ఏపీకి న్యాయం చేయాలని పోరాడుతున్నాం
  • బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది
  • రాబోయే ఎన్నికల్లో టీడీపీకే పట్టం
ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయాలని కేంద్రం పై పోరాడుతున్నట్లు టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ తెలిపారు. సీబీఐ, ఈడీ వంటి విచారణ సంస్థలతో టీడీపీ నేతలు, మద్దతుదారులపై దాడులు చేయిస్తూ కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధి  కోసం బీజేపీయేతర పక్షాలను ఓ తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్ కు బీజేపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని కొనకళ్ల మండిపడ్డారు. అలాంటివారికి ప్రస్తుతం ఏపీలో వైసీపీ, జనసేన పార్టీలు కొమ్ముకాస్తున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా వైఖరి మార్చుకోకుంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలే వీరికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజలు మరోసారి టీడీపీకే పట్టం కట్టబోతున్నారని జోస్యం చెప్పారు.
Andhra Pradesh
Tirumala
Tirupati
Telugudesam
konakalla narayana
BJP
YSRCP
Jana Sena

More Telugu News