Chandrababu: జగన్‌పై మీ ఆరోపణలు హుందాగా లేవు.. రాజేంద్రప్రసాద్‌ను మందలించిన చంద్రబాబు

  • జగన్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేసిన రాజేంద్రప్రసాద్
  • పిలిచి మందలించిన చంద్రబాబు
  • హుందాగా వ్యవహరించాలంటూ క్లాస్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ చేసిన ఆరోపణలపై చంద్రబాబు స్పందించారు. జగన్‌పై ఆయన చేసిన ఆరోపణలు హుందాగా లేవని మందలించారు. ఆరోపణలు కూడా హుందాగా ఉండాలని, ఇటువంటి విషయాల్లో స్పందించేటప్పుడు మరింత సంయమనం పాటించాలని రాజేంద్రప్రసాద్‌కు సూచించారు.

జగన్‌పై కత్తి దాడి ఘటనపై రాజేంద్రప్రసాద్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దాడి విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నట్టు చెప్పారు.  జగన్ కుటుంబంలో విభేదాలు ఉన్నాయని పేర్కొన్న ఆయన, జగన్‌పై హత్యాయత్నానికి అవే కారణమని అనుమానిస్తున్నట్టు చెప్పారు. జగన్ మరణిస్తే, ఆ సానుభూతితో సీఎం పీఠం ఎక్కాలని విజయమ్మ, షర్మిల భావిస్తున్నారని ఆరోపించారు.
Chandrababu
Andhra Pradesh
Rajendraprasad
Telugudesam
Jagan
YSRCP

More Telugu News